ముంబైలో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తారనే విషయం తెలిసిందే. కాగా, ముంబై రైల్వే స్టేషన్లలో రద్దీ గురించి తెలిపే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్లాట్ ఫామ్ పై వందలాది మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఓ లోకల్ ట్రైన్ రావడంతో ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ట్రైన్ లో రద్దీ అప్పటికే ఫుల్ గా ఉండడంతో బయట ఉన్నవారు ఎక్కలేకపోతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైళ్లను పెంచాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa