శనివారం ఉదయం నవులూరు గ్రామంలోని 500 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. సాయంత్రం కృష్ణాయపాలెంలో కృష్ణాయపాలెం, పెనుమాక లబ్ధిదారు లకు పట్టాల పంపిణీ జరగనున్నట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.