పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి , క్రోసూరు, బెల్లంకొండ, పెదకూరపాడు మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు రాజమహేంద్రవరానికి శనివారం బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ మహానాడు శని, ఆదివారాలలో జరగనున్నాయి. పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్, అచ్చంపేట మండల అధ్యక్షులు ఆశీర్వాదం, అమరావతి మండలం అధ్యక్షులు విష్ణు ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు.