విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. గుంటూరు పట్టణంలోని ఏటుకూరు బైపాస్ లోని ఆంధ్రా భోజనం హోటల్లో నారాయణ (50) పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం హోటల్ వెనుక పడి ఉన్న రేకుల షెడ్డు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.