ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాలనలో అకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అక్కడి క్రైస్తవులపై ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ దేశంలో క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కనిపిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారట. అలా ఓ రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకూ 70 వేల మందిని ఖైదు చేసినట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa