చెన్నై- బెంగళూరు, చిత్తూరు - తచ్చురు ఎక్స్ప్రెస్ హైవే, నేషనల్ హైవే రోడ్ల అభివృద్ధికి అవసరమైన భూముల ను పరిశీలించి వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు డిఆర్ ఓ యన్. రాజశేఖర్ తో కలసి జిల్లాలో జరుగుతున్న ఎక్స్ప్రెస్ హై వే, యన్ హెచ్ హై వే, ఆర్ & బి డివిజన్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి యన్ హెచ్ పిడి లు, చిత్తూరు, పలమనేరు ఆర్ డి ఓ లు, విద్యుత్, ఆర్ & బి, ఉద్యానవనం, ఆర్ డబ్య్లు, ఏ పి ఐ ఐ సి, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెన్నై, బెంగళూరు, చిత్తూరు, తచ్చురు ఎక్స్ ప్రెస్ హై వే, యన్. హెచ్ హై వే, ఆర్ & బి, డివిజన్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్యాకేజీ, 1, 2, 3, రోడ్ల పనులకు కు సంబంధించి అవసరమైన భూముల ను డికెటి, వైలేషన్ వంటివి వెంటనే పూర్తి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa