సరిహద్దులో మరోసారి పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. పంజాబ్ లోని భారత్- పాక్ సరిహద్దులో నిన్న రాత్రి అమృత్ సర్ జిల్లా దనోయ్ ఖుర్ద్ గ్రామంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ డ్రోన్ ను గుర్తించి కూల్చివేశారు. అనంతరం డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, 3.4 కిలోల బరువున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.