పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళల మహా పంచాయత్ పేరుతో ఆందోళనకు సిద్ధమైన రెజ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో ఢిలీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి మరీ బస్సులో పడేశారు. ఈనేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో పథకాలు తెచ్చినప్పుడు రెజ్లర్లతో ప్రధాని మోదీ అలా.. ఇప్పుడు ఇలా అని ట్వీట్ చేశారు.