ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిష్ఠించిన చారిత్రాత్మక ‘సెంగోల్ (రాజదండం)’ తొలిరోజే వంగిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. రెజ్లర్లకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.