చాలా మంది టీ,కాపీ తాగుతూ సిగరెట్ తాగుతారు. అలాగే కొంత మంది మద్యం తాగుతూ సిగరెట్ తాగుతారు. దానిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తుంటారు. కానీ అది చాలా ప్రమాదమని వైద్యులు తేల్చారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ షూమేకర్ కీలక విషయం తెలిపారు. వారానికి 750 మిల్లీలీటర్ల ఆల్కహాల్ తాగడం వల్ల వారానికి ఐదు సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు. మీరు సిగరెట్ ఆల్కహాల్ రెండింటినీ కలిపి తాగినప్పుడు, ప్రమాదం ఎలా పెరుగుతుందో ఆలోచించండి. అందుకే బీ అలర్ట్ వెంటనే వాటిని బంద్ చేసి మీ ఆరోగ్యం కాపాడుకోండి.