టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ మంత్రి జోగి రమేష్ సోమవారం ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును డర్టీ బాబుగా, వారి మేనిఫెస్టోను డస్ట్బిన్గా అభివర్ణించారు. 2014లో 450కి పైగా చంద్రబాబు హామీలిచ్చారని, అధికారం చేపట్టాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని అన్నారు. వైసీపీ 2019 మేనిఫెస్టో, టీడీపీ 2014 మేనిఫెస్టోపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ 98 శాతం హామీలను అమలు చేసిందని చెప్పారు.