తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులు గాయపడ్డారు. వీరంతా కర్ణాటకలోని కోలార్ కి చెందినవారిగా గుర్తించారు. శ్రీవారిని దర్శించుకొని కిందికి దిగుతుండగా, వాహనం ఆరో మలుపు వద్ద రక్షణ గోడను ఢీకొట్టి బోల్తాపడింది. భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa