అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్పూర్లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లోనూ సోమవారం ఉదయం 7.48 గంటలకు భూకంపం సంభవించింది. అండమాన్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని అధికారులు చెప్పారు.