గుజరాత్‌లోని సూరత్‌లో బాగేశ్వర్ ధామ్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య ధీరేంద్ర శాస్త్రి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సహకరిస్తే పాకిస్తాన్‌ను సైతం హిందూ దేశంగా మార్చేస్తానని పేర్కొన్నారు. హిందుత్వం పేరుతో హిందువులు అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశం తనకు ఉందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా, వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.