ఆపదలో ఉన్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. సోమవారం రేపల్లెలోని ఎంపీ మోపిదేవి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఇసుకపల్లి కి చెందిన కర్ర రమేష్ కు 35, 000, రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల లక్ష్మీ రమ్యకు లక్ష 20 వేలు, రేపల్లెకు చెందిన షేక్ ఆశాకు 65 వేల రూపాయల చెక్కులను అందించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు, రేపల్లె మున్సిపల్ చైర్మన్ కట్ట మంగా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.