రేపల్లె నియోజకవర్గం లోని రెవెన్యూ, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సమీక్ష నిర్వహించారు. సోమవారం రేపల్లెలోని ఎంపీ మోపిదేవి కార్యాలయంలో అధికారులతో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అధికారులందరూ సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. సమావేశంలో రేపల్లె ఆర్డిఓ జగనాదం పార్థసారథి, హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.