రాజధాని అమరావతిR 5 జోన్లో పెదకాకాని మండలం అగతవరప్పాడు గ్రామంలో అర్హులైన 49 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మంగళవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ అమరావతి రాజధానిలో ఇప్పటికే 50 వేల పైచిలుకు ఇళ్లపట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారని గుర్తు చేశారు. రాజధాని పరిధిలోని అగతవరప్పాడు గ్రామంలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బందితోపాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.