గుంటూరు జిల్లాలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడంతో పాటు వారికి పునరావాసం కల్పించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్ లో బాల కార్మికుల నిర్మూలనపై అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. జూన్ 12న ప్రపంచ బాలల కార్మికుల దినోత్సవం నిర్వహించాలన్నారు.