మంగళగిరి నగరంలోని చిన్నపంజా వీధిలో ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి కాంట్రవర్సీ బ్యానర్లు ప్రింటింగ్ వేయమని తీర్మానించారు. అత్యవసరమైతే రాష్ట్ర కమిటీ లేదా లోకల్ యూనియన్ వారిని సంప్రదించి ప్రింటింగ్ వేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ సూచనలను తూచా తప్పకుండా ప్రతిఒక్క సభ్యుడు పాటిస్తామని తెలిపారు. సమావేశంలో నగరంలోని ఫ్లెక్స్ ప్రింటింగ్ యూనిట్ యజమానులు పాల్గొన్నారు.