జగనన్న ప్రభుత్వంలోనే వికలాంగులకు భరోసా లభించిందని రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని. ఇకనైనా అలాంటివి మానుకోకపోతే రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ వారికి బుద్ధి చెబుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికలాంగుల కమిటీ సభ్యులు హెచ్చరించారు. సోమవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వికలాంగుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ దివ్యాంగులకు, వారి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టానికి భద్రత కల్పిస్తూ సుమారు 51 గైడ్లైన్స్తో రూల్స్ ఏర్పాటు చేసి మాకు ఒక రక్షణ కవచాన్ని అందించారని అన్నారు. దివ్యాంగుల పట్ల మీకు చిత్తశుద్ది ఉంటే గడిచిన నాలుగు సంవత్సరాల నుండి ఎందుకు స్పందించలేదని మందకృష్ణ మాదిగను ప్రశ్నించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ రాజు, తిరుపతి నెల్లూరు, కడప రీజనలోకో ఆర్డినేటర్ కొమ్మిరెడ్డి శివారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షులు చెల్లా రామయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు నూర్ బాషా, అల్లా భక్షు, రాష్ట్ర నూర్బాషా, నాయకులు బండారు దుర్గారావు, బొక్క అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.