కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయపురిసౌత్ పరిధిలోని చింతలతండాలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కేతావత్ సురేష్ ఫైనాన్స్ ట్రాక్టర్ కొన్నాడు. ప్రతినెలా ఫైనాన్స్ చెల్లించలేక అప్పులపాలయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.