లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్ జైలుకు తరలించారు.