ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫంక్చర్ దుకానానికి దగ్గర రాగానే వూహించని విధంగా కారు టైర్ ఫట్

national |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 10:04 PM

ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా పలు రకాల మాఫియాలను చూసివుంటాం. కానీ ఫంక్చర్ మాఫియా ఎక్కడైనా చూశారా...? ఇది వింటే అది కూడా ఉందా అనిపిస్తుంది. పంక్చర్ దుకాణానికి అటూ ఇటుగా కిలోమీటర్ సమీపానికి రాగానే వాహనం టైరు పంక్చర్ అవుతోంది. దగ్గర్లోని పంక్చర్ షాపు వద్దకు వాహనాన్ని తీసుకెళ్తే.. వాళ్లు ట్యూబ్ పాడైందని, ఇంకేదో అయ్యిందని చెప్పి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వాహనదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంత మందైతే.. టైరు కూడా పాడైందని చెప్పి మార్పిస్తున్నారు. కొత్త వాహనాల టైర్లు కూడా ఉన్నట్టుండీ పంక్చర్ అవుతున్నాయి. ట్యూబులు పాడయ్యాయని చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుండటంతో కొంత మంది వాహనదారులకు అనుమానం కలిగింది. ఏంటని ఆరా తీయడంతో కొత్త రకం మాఫియా గుట్టు రట్టైంది. బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ పంక్చర్ల మాఫియా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


పంక్చర్‌ దుకాణం ఉన్న చోటుకు ఒక కిలోమీటర్‌ పరిధిలో రోడ్లపై చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను పడేస్తారు. కొంత మంది ముఠాగా ఏర్పడి ఇలా చేస్తున్నారు. మేకులు గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్‌ అవుతాయి. వాహనదారులు సహజంగానే సమీపంలో పంక్చర్ షాపు ఎక్కడ ఉందో ఆరా తీసి, అక్కడికి వెళ్తారు. దీన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.


బెంగళూరు నగర శివార్లలో ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అశోకనగర పోటీస్ స్టేషన్ పరిధిలోని దత్తపీఠానికి వెళ్లే మార్గంలో వందలాది మేకులు, ఇనుప చువ్వలను పోలీసులు సేకరించారు. అనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్‌ సమీపంలోనూ రోజూ కిలోలకొద్దీ మేకులు, ఇనుప తీగలను ట్రాఫిక్ పోలీసులు సేకరిస్తున్నారు.


ఈ మార్గాల్లో మేకులు వేసే మాఫియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మార్గాల్లో సీసీ కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పంక్చర్ మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించారు. మీ నగరం/ పట్టణంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి..







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com