వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. అవినాశ్ ముందస్తు బెయిల్ పై సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కాగా, అవినాశ్ తల్లి అనారోగ్యం నేపథ్యంలో మే 31 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.