వేసవి దృష్ట్యా రైళ్లకు భారీగా రద్దీ పెరిగింది. దీంతో తిరుపతి, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1న కాచిగూడ- తిరుపతి, జూన్ 2న తిరుపతి- కాచిగూడ, జూన్ 3న కాచిగూడ- కాకినాడ, జూన్ 4న కాకినాడ- కాచిగూడ ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాచిగూడ- తిరుపతి రైళ్లు మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్, కడప మీదుగా, కాచిగూడ- కాకినాడ రైళ్లు వరంగల్, విజయవాడ మార్గంలో నడవనున్నాయి.