మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 'నమో షెట్కారీ' పేరుతో ప్రతి ఏటా రైతులకు రూ. 6000 నగదు సాయం అందించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం ఏక్ నాథ్ శిండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అదనంగా రైతు సాయాన్ని అందిస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేయనున్నామని వెల్లడించారు.