నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన షేక్ హాజిరా భాను అను ఆమె మే 10వ తేదీన కట్టెల పొయ్యి పైన వేడినీళ్ళు కాంచుతూ ప్రమాదానికి గురయ్యారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తిరుపతిలో చనిపోయినట్లు నందలూరు ఎస్సై చెన్నకేశవ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నీళ్లు కాచుకుంటూ ఉన్న సమయం లో తన భర్త మహేష్ కువైట్ నుండి ఫోన్ చేయగా, ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ప్రమాదవశాత్తు నైటీ కి మంటలు అంటుకోగా, హాజిరా భాను బయపడి కేకలు వేస్తూ బయటికి వచ్చినట్లు వారు తెలిపారు,ఇరుగు పొరుగు వారు నీళ్ళు పోసి మంటలు ఆర్పినట్లు, తరువాత హాజిరా భాను ను తిరుపతి లోని రమాదేవి ఆసుపత్రి చేర్పించగా చికిస్థ పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు నందలూరు యసి. ఐ చెన్నకేశవ తెలిపినారు.