భార్యపై అనుమానంతో పసికందుకు పురుగులమందు ఎక్కించిన ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగింది. చందన్, తన్మయి దంపతులకు మే9న ఆడపిల్ల పుట్టింది. అయితే, భార్య వివాహేతర సంబంధం వల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్ రగిలిపోయాడు. దీంతో భార్య వేరే గదిలో ఉండగా, చిన్నారికి సిరంజితో పురుగల మందు ఎక్కించాడు. ఇది గమనించిన భార్య చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.