విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రొయ్యల కంపెనీ పూర్తిగా దగ్ధమైంది. నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలోని గుండం తిప్ప గ్రామంలో కొక్కిలిగడ్డ అర్జున్ రావు, గోపీలకు చెందిన రొయ్యల కంపెనీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి రొయ్యలు మొత్తం తగలబడిపోయాయి. సంఘటన స్థలానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.