బాపట్ల రూరల్ నందిరాజు తోట నేషనల్ హైవేపై మోటార్ వెహికల్ తనిఖీ నిర్వహించిన రూరల్ ఎస్సై వెంకటప్రసాద్. ఈసందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహన చోదకులు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వాహనానికి సంబంధించిన పత్రాలు వారి వెంట ఉంచుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి అపరాధ రుసుము విధించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహనదారులకు తెలిపారు. ఎస్సై వెంట వారి సిబ్బంది శివరామకృష్ణ, వై నాగరాజు, కొండయ్య, యాదాద్రి, వెంకటేశ్వర్లు ఉన్నారు.