రవాణా శాఖ కమిషనర్ ఆదేశానుసారం మిషన్ లైఫ్ ప్రోగ్రాం బాపట్ల జిల్లాలో గత రెండు రోజుల నుండి వాహనాల తనిఖీ జరుగుతోంది. ఈ సందర్భంగా వాహన చోధకులకు వాహన కాలుష్యం వల్ల జరిగే దుష్ప్రభావం గురించి అధికారులు వివరించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ , ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా బాపట్ల చీలు రోడ్డు సెంటర్ వద్ద వాహనాలను ఆపి కాలుష్యం పరిశీలించి అధిక కాలుష్యం వెలువడే వాహనాలను గుర్తించి ఆ వాహనాలు రోడ్డు మీద తిరగకుండా కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల కాలుష్యం కొంతమేరకు తగ్గించిన వాళ్ళు అవుతామని భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి అన్నారు ఈ కార్యక్రమంలో వాహన తనికి అధికారులు రంగారావు. ప్రసన్నకుమారి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంకమ్మరావు సిబ్బంది పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు.