విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం అర్ధరాత్రి భారీ దోపిడి జరిగింది. రెండు ద్విచక్రవాహనలు పై వచ్చిన నలుగురు దుండగులు కారును అడ్డగించి రూ. 50 లక్షలు నగదుతో పరారయ్యారు. పూసపాటిరేగ పోలీసులకు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడికి చెందిన కోట్ల వంశీకృష్ణ అనే ధాన్యం వ్యాపారి పిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు.