పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బట్టువారిపల్లి సమీపంలో ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. దీనిని రూ. 1. 2 కోట్లతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పిటిసి సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప, నాయకులు వెంకటస్వామి, ఇమ్రాన్, రమేష్ రెడ్డి, నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.