కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31 శాతం డీఏ పొందుతున్నారు. తాజాగా 4 శాతం డీఏ పెంచడంతో 35 శాతానికి చేరింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.