ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... మండల పరిధిలోని కొండలరావుపాలెం గ్రామానికి చెందిన బొకినాల రవికుమార్‌కు అదే గ్రామానికి చెందిన సుమిత్రకు రెండేళ్ల కిందట వివాహమైంది. కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ ఆపై అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయి. సుమిత్ర అటు తల్లిదండ్రుల స్థితిని తలుచుకుని వారికి చెప్పలేక, అత్తింటి వేధింపులు తట్టుకోలేక, సోమవారం టీబీ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ తరుణంలో ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.