భారతీయ జనతా పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గా కన్నాను నియమించారు. కాగా, ప్రస్తుత బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల కారణంగా కన్నా బీజేపీని వీడి టీడీపీలో చేరారు.