ఇంతవరకు గ్యాస్ సిలిండర్లు మాత్రమే పేలడం చూశాం. కానీ ఏసీలు కూడా పేలుతాయని ఎంతమందికి తెలుసు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ఏసీలు పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టెబిలైజర్లను ఉపయోగించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కూడా అధిక వేడి కారణంగా ఏసీలు వేడెక్కుతాయని, మంటలు చెలరేగే ముప్పు ఉంటుందని చెబుతున్నారు. అధిక వేడి, ఒత్తిడితో కారణంగా ఏసీలో ఉపయోగించే గ్యాస్ లీకై పేలుడు సంభవించవచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కువ గంటలు నిరంతరాయంగా ఏసీలు ఉపయోగించడం మంచిది కాదని వివరిస్తున్నారు. దీంతో పాటు ఏసీలను ఎప్పిటికప్పుడు క్లీన్ చేసుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలని సూచిస్తున్నారు.