ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వరదయ్య పాళెం మండలం కువ్వాకుళ్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను నాగేంద్ర(31), శంకరయ్య(50), ఏడుకొండలు(45)గా గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, టపాసుల కేంద్రానికి మార్చితోనే లైసెన్సు గడువు ముగిసినప్పటికీ అనధికారికంగా టపాసుల్ని తయారు చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa