మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అహ్మద్ నగర్ పేరును అహల్య నగర్ గా మార్చుతున్నట్లు ప్రకటించారు. మరాఠా మాల్వా రాజ్యానికి చెందిన హోల్కర్ రాణి అహల్యాబాయి హోల్కర్ వర్థంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను ఛత్రపతి శంభాజీ నగర్, ధారాశివ్ గా మార్చాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.