భార్యభర్తలు ఒకేరోజు మరణించిన విషాద ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. నరుకూరు గ్రామానికి చెందిన రమణ(40), సుమలత(36) దంపతులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు వీరిద్దరినీ చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం రోజు రమణను చెన్నై నుండి నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. భర్త అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల్లోనే సుమలత కూడా మృతిచెందింది.