ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఆకాశ్, శ్లోకాలకు 2019లో పెళ్లి జరగగా, 2020 డిసెంబర్ లో కుమారుడికి జన్మనిచ్చారు. తాజాగా శ్లోకా ఆడపిల్లకు జన్మనిచ్చారు. దీంతో అంబానీ కుటుంబంలో సంతోషం నెలకొంది.