రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. 100 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. 200 యూనిట్లను వినియోగించే వారికి ఇంధన సర్ చార్జీలతో పాటు ఇతర చార్జీలను మాఫీ చేస్తామని అన్నారు. కాగా, ఇప్పటికే రైతులకు 2000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అమలు చేస్తున్నారు.