విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక, బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ పరిశీలించారు. స్టేషను ప్రాంగణం, ప్రాపర్టీ గదులను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్టు విచారణలో ఉన్న లాంగ్ పెండింగు కేసుల్లో ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా జ్యుడిషియల్ అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు.