పాఠశాలలు ప్రారంభం అయ్యేలోగా నాడు నేడు పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. టాయిలెట్స్, కిచెన్ షేడ్స్, మేజర్ మైనర్ రేపైర్స్ పనులన్నీ వచ్చే పది రోజుల్లో వేగంగా జరగాలని, పిల్లలు వచ్చే నాటికి పనులన్నీ పూర్తి చేయాలనీ అన్నారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎం. ఈ. ఓ లు, డి. ఈ లు, ఎ. ఈ లతో నాడు నేడు పనుల పురోగతి పై కలెక్టర్ మండల వారీగా సమీక్షించారు. లేబర్ , సిమెంట్ లేని చోట పక్క మండలాల నుండి సర్దుబాటు చేసుకోవాలని, పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని అన్నారు. పనులన్నీ పేరెంట్స్ కమిటీలతోనే జరగాలని స్పష్టం చేసారు. గత సమీక్ష 15 రోజుల క్రితం జరిగిందని, ఈ 15 రోజుల్లో కొన్ని మండలాల్లో ఎలాంటి పురోగతి కనపడ లేదని, ఇలాగె ఉంటె చర్యలు తప్పవని అన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులను వెంట వెంటనే అప్లోడ్ చేయాలనీ అన్నారు.
ఎం. ఈ. ఓలు ఈ పది రోజుల్లో వారి పరిధి లోనున్న అన్ని పాఠశాలలను సందర్శించి పనుల తీరు పై దృష్టి పెట్టాలని అన్నారు. పాఠశాలల ప్రారంభం తర్వాత విద్యార్ధుల నమోదు, రోజు వారీ హాజరు పరిశీలిస్తానని, విద్యార్ధుల హాజరు ఖచితంగా ఉండాలని అన్నారు. అదే విధంగా డ్రాప్ ఔట్ల వివరాలను కూడా దగ్గర పెట్టుకోవాలని, రెగ్యులర్ గా బడికి పిల్లలు వచ్చేలా చూసే బాధ్యత టీచర్ల దేనని అన్నారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ, మెనూ తప్పనిసరిగా పాటించాలని, తనిఖీల్లో నేను కూడా భోజనం చేస్తానని అన్నారు. తాగు నీరు, టాయిలెట్స్ అన్ని స్కూల్స్ లో ఉండాలని అన్నారు. సబ్జెక్టు టీచర్స్ విద్యార్ధులకు బోధించేతప్పుడు వారికి ఆసక్తి కలిగేల బోధించాలని, ఏ తరగతి లోనైనా ఏ విద్యర్దినైన రాండమ్ గా చదివిస్తానని, విద్యార్ధులు చదవలేకపోయిన, ప్రశ్నలు చెప్ప లేకపోయినా సంబంధిత ఉపాధ్యాయులే బాధ్యత వహించాలని అన్నారు. 10 వ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత చెందేలా మొదటి రోజు నుండే ప్రణాళికా బద్ధంగా బోధించాలని అన్నారు. వచ్చే ఏడాది ఫలితాలు మెరుగుపడాలని అన్నారు.