గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిలస్ట్రార్ ఆఫీసులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో వంద సంవత్సరాల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టామని, వివాదాలకు తావు లేకుండా రైతన్నల చేతిలో పత్రాలను పెడుతున్నామని అన్నారు. సున్నా వడ్డీ ద్వారా 74 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చామని, ఇందుకోసం రూ.1835 కోట్లు ఇచ్చామన్నారు.