పేద ప్రజలపై ఏపీ సీఎం జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. దశపల్ల, రేడియంట్, ఎన్సీసీ భూముల్లో సైతం పేదలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, గుడివాడలోని భూములను అమర్నాథ్ మంత్రైన తర్వాత లాక్కున్నారని ఆరోపించారు. అనుకూల అధికారుల సాయంతో 400 ఏకరాల రికార్డులు తారుమారు చేశారని పేర్కొన్నారు.