దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఆయన అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నారు.