జూన్ నెలకి సంబంధించి రాష్ట్రంలో వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సిద్ధమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం తారువ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మొత్తం రాష్ట్రంలో63. 14 లక్షల మందికి1739. 75 కోట్లు రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మొత్తాన్ని2. 66 లక్షల మంది వాలంటీర్ ద్వారా ఒకటో తేదీ నుంచి 5 రోజులలో అందరికీ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ పెన్షన్ పంపిణీ డిఆర్డిఏ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ జరపడం జరుగుతదన్నారు. అలాగే ఆర్బిఐఎస్ ద్వారా పేన్షనర్ల ఒక గుర్తింపుతో పాటు, లబ్ధిదారులకు బయోమెట్రిక్, ఐరిష్, ఆధార్ వంటి ఒక ప్రమాణిక కరణ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియలో 15 వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు భాగస్వామ్యమవుతారని చెప్పారు. ఇప్పటికే ఈ మొత్తాన్ని సచివాలయాల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, సాంకేతిక కారణాలు మూలంగా ఏ ఒక్కరికి పెన్షన్ అండలేదన్న ఫిర్యాదు రాకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాబట్టి పేన్షనర్లు అందరూ జూన్ నెల కానుక పొందేందుకు సిద్దంగా ఉండాలన్నారు.