గిరిజన భూముల్లో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలు వెంటనే రద్దు చేయాలని గిరిజనులు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం వద్ద బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రోలుగుంట మండలం పనసలపాడు గ్రామ గిరిజనులు జగనన్న భూముల రీ-సర్వేలో తమ పేర్లు రికార్డుల్లో కనిపించకుండా చేసి తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డిఓ జయరాంకు వినతిపత్రం అందజేశారు