నర్సీపట్నం ఏఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కర్నూలు జిల్లా ఆదోని నుంచి బదిలీపై నర్సీపట్నం వచ్చారు. ఆయనకు వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలి పారు. సిబ్బంది సమన్వయంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. గంజాయి అక్రమరవాణా పై దృష్టి పెడతానని తెలిపారు.